అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు – అటవీ శాఖ హెచ్చరిక
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 18: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, అటవీ ఉత్పత్తులను అక్రమంగా తరలించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సి హెచ్ బాలమణి హెచ్చరించారు. చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు వర్షపాతం, భూగర్భ జలాల సంరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఒక్క చెట్టును నరికివేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, వన్యప్రాణుల నివాస ప్రాంతాలపై...