అశ్వాపురం ఎస్సీ కాలనీలో విజృంభిస్తున్న విషజ్వరాలు.వెంటనే హెల్త్ క్యాంపు నిర్వహించాలి
కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కాలనీలోని పలు కుటుంబాల్లో జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధులు మరింత విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. “ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకముందే...