తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరుకాపులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతను పెంపొందించేందుకు కుటుంబ సభ్యత్వం నమోదు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మున్నూరుకాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్యపటేల్ తెలిపారు. శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణంలోనీ పటేల్ గార్డెన్‌తో పాటు ఆసిఫాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్‌తో కలిసి వెబ్‌సైట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నూతన పదవులు పొందిన ఆసిఫాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు గాజుల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదారి సాయి (గోలేటి), కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రవి, వైస్ ప్రెసిడెంట్ పేరుక మహేష్, కాగజ్ నగర్ మండల యూత్ అధ్యక్షుడు పార్వతి సురేష్, ఉపాధ్యక్షుడు డెక్కపురి గోపాల్, పట్టణ అధ్యక్షుడు చిట్టంపల్లి అనిల్, ప్రధాన కార్యదర్శి పూదారి సాయి, కోశాధికారి పుల్లిశెట్టి వెంకటేష్‌లకు పదవులను
అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిశెట్టి సదాశివ్, సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.