PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:26 pm Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

ఎస్ పి ఎం సి ఎస్ ఆర్ తో నైపుణ్యా శిక్షణలకు ప్రోత్సాహం.

కాగజ్‌నగర్: సెప్టెంబర్ 07

కాగజ్ నగర్ పట్టణం లోని సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ (ఎస్పీఎం) సీఎస్‌ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా టైలరింగ్, కంప్యూటర్, డిటర్జెంట్ పౌడర్ తయారీ శిక్షణలను పూర్తి చేసిన 254 మందికి సోమవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఎస్‌పీఎం జనరల్ మేనేజర్లు (హెచ్‌ఆర్‌ & ఐఆర్) గిరి, (సివిల్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్) గిరీష్ రాయ్ శిక్షణార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు, యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని వాటిని స్వయం ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలని సూచించారు. ఆర్థిక స్వావలంబన కోసం ఎస్‌పీఎం సీఎస్‌ఆర్‌ నిరంతరం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. 2023 నుంచి టైలరింగ్ ద్వారా 721 మందికి పైగా, ఉచిత కంప్యూటర్ శిక్షణ ద్వారా 733 మందికి శిక్షణ అందించారు. అలాగే మష్రూమ్ కల్టివేషన్, జూట్ బ్యాగ్స్, స్క్రీన్ ప్రింటింగ్, డోర్ మ్యాట్స్, మగం వర్క్, డిటర్జెంట్ పౌడర్ తయారీ వంటి పలు రంగాల్లో మహిళలకు శిక్షణలు అందిస్తూ స్వయం ఉపాధికి ఎస్‌పీఎం సీఎస్‌ఆర్‌ చేయూతనిస్తోంది.