PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 1:23 pm Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

కాగజ్ నగర్ ఆశ్రమ పాఠశాల బాలురకు ఏకరూప దుస్తుల పంపిణీ.

కొమురం భీమ్ ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అన్నారు. కాగజ్‌నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాల బాలురను సందర్శించిన సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, డీఆర్‌డీఏ ఏపీడీ బానోత్ దత్తారంతో కలిసి పాఠశాలలో చదువుతున్న 220 మంది గిరిజన విద్యార్థులకు ఏకరూప దుస్తులు (యూనిఫాంలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 46 గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక జత ఏకరూప దుస్తులను అందజేస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 9,200 మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారి విద్యాాభివృద్ధి, ఆరోగ్యం, వసతి, భోజనం, దుస్తులు తదితర అన్ని అవసరాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జాదవ్ అంబాజీ విద్యార్థులకు సూచించారు. ఏకరూప దుస్తులు అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.