కాగజ్ నగర్ ఆశ్రమ పాఠశాల బాలురకు ఏకరూప దుస్తుల పంపిణీ.

కొమురం భీమ్ ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అన్నారు. కాగజ్‌నగర్ గిరిజన ఆశ్రమ పాఠశాల బాలురను సందర్శించిన సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, డీఆర్‌డీఏ ఏపీడీ బానోత్ దత్తారంతో కలిసి పాఠశాలలో చదువుతున్న 220 మంది గిరిజన విద్యార్థులకు ఏకరూప దుస్తులు (యూనిఫాంలు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ, కుమరం భీమ్...