కొత్తపల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవం

భీమారం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ Franchise గ్రామ సర్పంచ్ దుర్గం తిరుపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట యోధుల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వసుంధర దేవి, ఉప సర్పంచ్ దుర్గం జనార్ధన్, పాలకవర్గ సభ్యులు కలగూర రమేష్, లింగాల సంపత్, ఎఫ్ ఏ కృష్ణ, ఆకుదారి శంకర్, బోగె రవీందర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు హీన, అంగన్వాడీ టీచర్ అరిఫా, పాఠశాల విద్యార్థులు...