చింతల మానేపల్లి సెప్టెంబర్ 18:
నమ్మదగిన సమా
చారం మేరకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా పట్టికను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన చింతలమానపల్లి మండలంలో చోటుచేసుకుంది. గూడెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి బొలెరో వాహనంలో పట్టికను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కోర్సిని గ్రామానికి చెందిన తోడేటి రాజేష్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి సుమారు 15 క్వింటాళ్ల పట్టికను బొలెరో వాహనంలో తీసుకొస్తుండగా గూడెం చెక్పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు. స్వాధీనం చేసుకున్న పట్టిక విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు, లంబడిహట్టి గ్రామానికి చెందిన శ్యామ్ అలియాస్ శ్యామ్‌లాల్ సూచనల మేరకే పట్టికను తీసుకొస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టికను విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు నిందితుడు విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు బొలెరో వాహనంతో పాటు 15 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చింతలమానపల్లి ఎస్సై యం కమలాకర్ తెలిపారు.