గూడెం చెక్పోస్ట్ వద్ద 15 క్వింటాళ్ల పటిక స్వాధీనం.

చింతల మానేపల్లి సెప్టెంబర్ 18:  నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా పట్టికను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన చింతలమానపల్లి మండలంలో చోటుచేసుకుంది. గూడెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి బొలెరో వాహనంలో పట్టికను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోర్సిని గ్రామానికి చెందిన తోడేటి రాజేష్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి సుమారు 15 క్వింటాళ్ల పట్టికను బొలెరో వాహనంలో తీసుకొస్తుండగా గూడెం చెక్‌పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు....