PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 2:09 pm Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30:

న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ పాల్గొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు పలువురు దళిత, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో కలిసి వేదికపై పాల్గొన్న శ్యామ్ నాయక్, దళిత, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి మద్దతు తెలిపారు.ఈ వర్గాల అభ్యున్నతికి, సమాన అవకాశాలకు, హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.