ప్రజావాణి లో దరఖాస్తు తీసుకొని అధికారి పై చర్యలు తీసుకోవాలి

బెజ్జూర్ మండలం సెప్టెంబర్ 28: ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలోనే దరఖాస్తు స్వీకరణకు నిరాకరణ ఎదురవడం చర్చనీయాంశంగా మారింది. బెజ్జూర్ మండలంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన దుర్గం శరత్ చంద్ర సమర్పించేందుకు తీసుకెళ్లిన దరఖాస్తును ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ స్వీకరించకుండా తిరస్కరించారని ఆర్టీఐ కార్యకర్తలు పేర్కొన్నారు.దుర్గం శరత్ చంద్ర ఆర్టీఐ కార్యకర్తగా, మానవ హక్కుల సంఘం సిర్పూర్–టి నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టం...