భీమారం మండల కేంద్రంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

భీమారం మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి కుల బాంధవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా నాయకుడిగా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.