PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 3:42 pm Posted by : gajanandmanthri@gmail.com

మద్దికల్ గ్రామపంచాయతీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

 మండలం, మద్దికల్ గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పొతేం సమ్మయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట యోధుల్ని స్మరించుకున్నారు. ఈ lకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గణేష్ , ఉప సర్పంచ్ తేజస్విని రాజు పాలకవర్గ సభ్యులు , డేగ సమ్మయ్య, నాయకులు రాజు, కారోబార్ చందు, ప్రధానోపాధ్యాయులు జనార్దన్ , ఉపాధ్యాయులు ,సునీత, ఆనంద్, అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ , అపూర్వ,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.