PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:31 pm Posted by : gajanandmanthri@gmail.com

రక్తదాన శిబిరంలో పాల్గొన్న భీమారం బిజెపి నాయకులు

చెన్నూర్ పట్టణంలోని మార్వాడి ధర్మశాల లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో భీమారం మండలానికి చెందిన బిజెపి నాయకులు దుర్గం జనార్ధన్, ఆకుదారి శంకర్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ , బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దుర్గం జనార్దన్ ను బిజెపి నేతలు అభినందించారు