PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:16 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ కోట వేణుగోపాల్

కాగజ్ నగర్ సెప్టెంబర్ 28:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నూతన సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి ని బారెగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బారెగూడ గ్రామానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను సాధించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నాగోషే హన్మంతు పాల్గొన్నారు.