PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 9:09 pm Posted by : PORU TELANGANA

మంత్రాల నెపంతో మైనర్ బాలిక తో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు,. ఫోక్సో కేసు నమోదు

పోరు తెలంగాణ, మంచిర్యాల, సెప్టెంబర్ 11.

తేది: 10.09.2026 రోజున లక్షేట్టిపేట్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదిదారు ఇచ్చిన పిర్యాదు మేరకు ధర్మపురికి చెందిన బాధితురాలి తల్లి తన కూతురుకి ఆరోగ్యం బాగులేక పోవడంతో లక్షేట్టిపేట్ గోదావరి రోడ్ కి చెందిన ఒక వ్యక్తి జాతకాలు చూసి బాగు చేస్తాడని తెలిసి తేది: 08.09.2026 రోజున లక్షేట్టిపేట్ గోదావరి రోడ్ కి చెందిన పెండెం సతీష్ అను వ్యక్తి దగ్గరకి రాగ అట్టి పెండెం సతీష్ అను వ్యక్తి ఇదే అదును అనుకుని అట్టి అమ్మాయి(బాధితురాలు)ని ఒంటరిగా పూజ రూమ్ పక్కన బయట వైపు తీసుకెళ్ళి అసబ్యకరంగా ప్రవర్తించి, లైంగికంగా వేదించినాడు. ఇట్టి విషయాన్నీ తల్లి తండ్రులకి చెప్తే చంపుతానని బెదిరించగా బాదితురాలు ఆ రోజు ఎం చెప్పలేదు. తిరిగి తేది: 10.09.2026 రోజున అమ్మాయి ఇట్టి విషయం తల్లి తండ్రులకి చెప్పగా, అమ్మాయి తల్లి లక్షేట్టిపేట్ పోలిస్ స్టేషన్ లో దరఖాస్తూ ఇవ్వగా ఇట్టి పెండెం సతీష్ ఫై పోక్సో కేసు నమోదు చేసి పోలీస్ లు ఇట్టి దర్యాప్తు లో బాగంగా పెండెం సతీష్ ని రిమాండ్ నిమిత్తం కోర్ట్ ముందు హాజరు పరుస్తున్నాం.
ఈ కేసును సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలపై, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఉత్తర్వుల మేరకు, మంచిర్యాల ఏసీపీ , R. ప్రకాశ్ పర్యవేక్షణలో, లక్షెట్టిపేట సీఐ రమణ మూర్తి, లక్షెట్టిపేట ఎస్సై సురేష్, సిబ్బంది చాక చక్యంగా నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి నిందితుడిని పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన లక్షెట్టిపేట సీఐ రమణ మూర్తి, లక్షెట్టిపేట ఎస్సై సురేష్ ని, సిబ్బంది ఎ ఎస్సై అన్వర్ హుస్సేన్, హెచ్ సి వసంత్, పి సి సుధాకర్, రాజమౌళి, సత్యనారాయణ, మల్లేష్, కుమారస్వామి, సాంబరి రమేష్, రవీందర్, బానావత్ రమేష్, మహేష్, తిరుపతి, శ్రీకాంత్, ప్రేం సాగర్, సాగర్, మనీషా, ప్రవలికలను సీపీ , డీసీపీ అబినందించినారు.
హెచ్చరిక :

లక్షేట్టిపేట్ సర్కిల్ పరిదిలో పట్టణ, గ్రామీణ ప్రజలందరికి తెలియచేయునది ఏమనగా మాయలు, మంత్రాలు, తంత్రాల, కడుపులో మందు పోయడం, ఎత్తి పోయడం లాంటి మూడ నమ్మకాలు లాంటివి ఉండవు, ఇట్టి మూడ నమ్మకాలు నమ్మి ఎవరు మోసపోవద్దు. మంత్రాల ద్వారా రోగాలు నయమవుతాయని, గుప్తనిధులు లభిస్తాయని లేదా ఇతరులకు కీడు జరుగుతుందని చెప్పే దొంగ బాబాలు, మంత్రగాళ్ల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దు. శారీరక లేదా మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే అర్హత కలిగిన వైద్యులను లేదా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి తప్ప, మంత్రగాళ్ల వద్దకు వెళ్లి సమయాన్ని, ప్రాణాలను పణంగా పెట్టవద్దు. ఈ విధమైన చర్యలు సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇట్టి నమ్మకాలతో అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎవరైనా పాల్పడితే కటిన చర్యలు తీసుకోబడుతా పోలీస్ లు హెచ్చరించారు.