PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 9:57 am Posted by : PORU TELANGANA

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది.

కాలనీకి చెందిన లావణ్య (32) రెండు రోజుల క్రితం తన తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి, దసరా పండగకు ముందే పుట్టింటికి వస్తానని తెలిపింది. ఈ విషయం భర్తకు చెప్పగా ఆయన అంగీకరించలేదని సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్సై తహిసీనొద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.