దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన లావణ్య (32) రెండు రోజుల క్రితం తన తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి, దసరా పండగకు ముందే పుట్టింటికి వస్తానని తెలిపింది. ఈ విషయం భర్తకు చెప్పగా ఆయన అంగీకరించలేదని సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్సై...