PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:21 pm Posted by : PORU TELANGANA

మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణకు చర్యలు

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులపై మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు..

బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల లో దాదాపు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరణ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ , మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..