ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సిరిసిల్ల నేతన్నల ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా వివరించారు. “మనిషి నాగరికత వస్త్రంతో ప్రారంభమైంది. అలాంటి వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల అడ్డా. చేనేత కార్మికులకు, చేతివృత్తులకు ఇది ప్రధాన కేంద్రం. అగ్గిపెట్టెలో చీరను మడతపెట్టే నైపుణ్యం ఇక్కడి నేత...