మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్‌లో కార్మికులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు సుధామల్ల హరికృష్ణ కేక్ కట్ చేసి కార్మికులకు తినిపించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
నస్పూర్ కార్మిక సంఘం అధ్యక్షులు కొయ్యల వెంకటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు జవాన్లు, బోర్ల తిరుపతి, చందు, అట్కపురపు లింగయ్య, సాదిక్, రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.