కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను. సంక్షేమ పథకాలు పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత కీలకమని దిశానిర్దేశం చేశాను. ప్రభుత్వంలో పూర్తికాలపు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి పనిచేస్తున్న 10.5 లక్షల మంది ఉద్యోగులే తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలు...