వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం
పెద్దపల్లి//వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్,సింగరేణి, మున్సిపల్, రెవెన్యూ,విద్యుత్, వైద్య ఆరోగ్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక,ఫిషరీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు,భద్రతా చర్యలు,ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై సీపీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నిమజ్జన...