పోలీసు సిబ్బందికి స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

మంచిర్యాల// రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ స్వయంగా భక్తులకు, పోలీసు సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించారు.పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని...