ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి//,రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ తాము ప్రారంభించిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని,ప్రజల కష్టాలను తొలగించి వారి...