కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్ వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు,గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతల పరిస్థితి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు,ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించిన డీఐజీ, రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్ కావడంతో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.