విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడం..* *నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారాన్ని అందించడం లక్ష్యం..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి..* *చిన్న బోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్..
*రాజన్న సిరిసిల్ల:* రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్న బోనాల లోని ఎస్టీ సంక్షేమ హాస్టల్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ తోపాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు....