పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం
కొలనూరు గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు గ్రామానికి చెందిన జంగా సుధాకర్ రెడ్డి ( 65) తన పొలంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లగా మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో భారీ వర్షం కురిసింది పొలంలో ఉన్న సుధాకర్ రెడ్డి సమీపంలో పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరుగా విలపించారు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..