శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి… మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు… డీజేలకు అనుమతులు లేవు: పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం

పెద్దపల్లి//రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యం, సోదరభావంతో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని అన్ని వర్గాల మతపెద్దలు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు...