PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 10:16 am Posted by : PORU TELANGANA

ప్రజా సమస్యల కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన

మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరా నాయక్

మహేశ్వరం, సెప్టెంబర్ 10, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం నాడు కేటీఆర్ తుక్కుగూడ ఫ్యాబ్ సిటీకి వచ్చిన సందర్భంగా
మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరా నాయక్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసం ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిత్యం పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తూ రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పార్టీ నాయకులు అండగా ఉంటూ ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలని కేటీఆర్ కోరారు.