PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 6:18 pm Posted by : PORU TELANGANA

ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో భక్తుల కోసం ‘వినాయక వ్రతకల్పం’ పుస్తక ఆవిష్కరణ

*భక్తుల కోసం ‘వినాయక వ్రతకల్పం’ పుస్తక ఆవిష్కరణ*

ఖమ్మం :- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, గెల్లా గ్రాండ్ అధినేత గెల్లా రవి భక్తుల కోసం ప్రత్యేకంగా ముద్రించిన ‘శ్రీ వినాయక వ్రతకల్పం’ పుస్తకాన్ని గెల్లా గ్రాండ్‌లో ఆవిష్కరించారు. వినాయక పూజా విధానం ప్రతి భక్తుడికి సులభంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ముద్రించినట్లు తెలిపారు.

గెల్లా రవి మాట్లాడుతూ హిందువుల పండుగల్లో వినాయక చవితికి విశిష్ట స్థానం ఉందన్నారు. భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా జీవితంలోని విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటారని తెలిపారు. సంప్రదాయబద్ధమైన పూజా విధానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ వ్యాపారవేత్త కల్వకుంట్ల గోపాల్, సీనియర్ జర్నలిస్ట్, వాసవి జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక సభ్యులు టీఎస్ చక్రవర్తి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఉపయోగపడే పూజా విధానాన్ని పుస్తక రూపంలో అందించడం అభినందనీయమన్నారు. గెల్లా రవి సేవాభావంతో, సాదాసీదాగా ఉంటూ సమాజంలోని అన్ని వర్గాలతో కలిసిమెలిసి ఉంటారని కొనియాడారు.

కార్యక్రమంలో పులిపాటి వాసవి నగర్ అధ్యక్షులు కొదుమూరి భద్రయ్య, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య రాష్ట్ర అధ్యక్షులు సిద్ధంశెట్టి శ్రీకాంత్, జిల్లా ఆర్య వైశ్య సభ నాయకులు బూర్లే పుల్లారావు, వ్యాపారవేత్తలు గెల్లా శ్రావణ్, గెల్లా సుజన్ కుమార్, వందనపు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.