మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తె అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు. మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు మోహన్‌కు అతని భార్య జమునకు మధ్య వివాహ సంబంధిత మనస్పర్థల కారణంగా 28-09-2026 రాత్రి గొడవ జరిగింది.ఈ గొడవను మనసులో పెట్టుకున్న జమున తన కుమార్తెతో కలిసి...