PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 3:14 pm Posted by : PORU TELANGANA

పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రామగుండం//పెద్దపల్లి

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్బంగా సీపీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపీ‌ అంబర్ కిషోర్ ఝా, కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికి, తెలంగాణకు చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన దశాబ్దాల పాటు అలుపెరుగని కృషి చేశారని తెలిపారు.