ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద నిల్వల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మంచిర్యాల,సెప్టెంబర్ 10, 2026: జిల్లాలోని అన్ని ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద నిలువల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఎ.సి.ఎస్.ఓ. తో కలిసి ఇన్‌చార్జీలు, డి.ఈ.ఓ.లు, స్టేజ్–1, స్టేజ్–2 గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు...