PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 6:10 pm Posted by : PORU TELANGANA

నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు*

*
మణుగూరు సెప్టెంబర్ 14 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధికూరపాటి దాసు

మణుగూరు పట్టణంలో పలుచోట్ల మహా గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ యందు అశోక్ నగర్ మణుగూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో గణపతి స్వామివారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.