నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు*
* మణుగూరు సెప్టెంబర్ 14 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధికూరపాటి దాసు మణుగూరు పట్టణంలో పలుచోట్ల మహా గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ యందు అశోక్ నగర్ మణుగూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ లో గణపతి స్వామివారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, మండల కాంగ్రెస్...