నల్గొండ జిల్లా TUWJ–IJU ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు రిలే దీక్షలకు MLC నెల్లికంటి సత్యం, వివిధ పార్టీల నాయకుల సంఘీభావం నల్లగొండ: జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో TUWJ–IJU నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులి మామిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలకు యూనియన్ నాయకులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు...