రాజీమార్గమే రాజమార్గం లక్షేటిపేట జూనియర్ సివిల్ జడ్జి ఇంచార్జీ బి కృష్ణ తేజ
మంచిర్యాల//లక్షెట్టిపేట: రాజీమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట కొర్టు ఇంచార్జీ జూనియర్ సివిల్ జడ్జి బి కృష్ణ తేజ పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కక్షిదారులు చిన్నచిన్న కేసులలో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టు తిరుగుకుండా లోక్ అదాలత్ లో రాజీకి వచ్చినట్టయితే కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారు ప్రతి ఒక్కరూ లోకాఆదాలతో ఆశ్రయించి కేసులలో రాజీ కావాలని సూచించారు. ఇలాంటి లోక్ అదాలత్ లు...