లక్షెట్టిపేట లోని బీట్ బజార్ వినాయక మండపంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.

మంచిర్యాల జిల్లా, సెప్టెంబర్ 18. లక్షెట్టిపేట లోని బీట్ బజార్ లో గల గణేష్ మండలి లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు అత్యంత వైభవంగా స్వామివారిని కొలుచుకున్నారు. స్వామివారికి 108 నైవేద్యాలను సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరైనారు. ఈ సందర్భంగా మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పూజానంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.