PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 4:21 pm Posted by : PORU TELANGANA

పీడీఎస్ బియ్యం పట్టివేత – ఒకరి అరెస్ట్

పోరు తెలంగాణ నెక్కొండ, సెప్టెంబర్ 26 అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నెక్కొండ పోలీసుల తో కలిసి పనికర గ్రామంలో ని గర్నపల్లి జితేందర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో 100 బస్తాలు (50 క్వింటాళ్లు) విలువ రూ.1,75,500/- ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గర్నపల్లి జితేందర్ రెడ్డి (40 సం.) ను అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నెక్కొండ పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్ స్పెక్టర్ జి. సుబ్బారెడ్డి, ఎస్.ఐ బి. ఉప్పలయ్య మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.