PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 12:53 pm Posted by : PORU TELANGANA

బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు సంబంధించిన రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

బెల్లంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు సంబంధించిన రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ఈ కేసులకు సంబంధించి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి,గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని న్యాయ నిర్బంధానికి పంపించింది.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎ. భాస్కర్ పర్యవేక్షణలో, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సీసీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి, బీఎస్‌ఎన్‌ఎల్ రాగి తీగల చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు
1. ఉప్పరి సంపత్
2. గొమాసా అజయ్ కృష్ణ
3. మారినేని రాజ్‌కుమార్
4. గొమాసా అనుకృష్ణ
5. దుర్గం శేఖర్
6. దుర్గం అంకులు
7. పాండి రాజ్‌కుమార్
8. సాంబోజు రమేష్

అరెస్ట్ చేసిన నిందితులను గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని న్యాయ నిర్బంధానికి పంపించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ రాగి తీగల చోరీలకు సంబంధించి నిందితుల గత నేర చరిత్ర,ముఠా కార్యకలాపాలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన ఇలాంటి చోరీ కేసుల్లో వారి ప్రమేయం తదితర అంశాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అవసరమైన మేరకు సంబంధిత గ్యాంగ్ ఫైళ్లు, సస్పెక్ట్ షీట్లు ప్రారంభించి, వారి నేర కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా అవసరమైన అన్ని చట్టపరమైన మరియు నిరోధక చర్యలు చేపడుతున్నారు.

దర్యాప్తులో పాల్గొన్న అధికారులు

ఈ కేసుల ఛేదనలో సీసీఎస్ ఏసీపీ కె. రవీందర్,సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ టి.గోపీ, బెల్లంపల్లి రూరల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. హనోక్,సీసీఎస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావు, తాల్లగురిజాల సబ్‌ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ,ఇతర సబ్‌డివిజన్ పోలీస్ సిబ్బంది,సీసీఎస్ ప్రత్యేక బృందం సమన్వయంతో సమర్థవంతంగా కృషి చేశారు.
ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు మరియు టెలికాం మౌలిక సదుపాయాల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని అధికారులు తెలిపారు.రాగి తీగలు,టెలికాం పరికరాలు మరియు ఇతర ప్రభుత్వ, ప్రజా ఆస్తుల చోరీలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.