బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు సంబంధించిన రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

బెల్లంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు వివిధ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు సంబంధించిన రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.ఈ కేసులకు సంబంధించి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి,గౌరవనీయ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారిని న్యాయ నిర్బంధానికి పంపించింది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎ. భాస్కర్ పర్యవేక్షణలో, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సీసీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందాలు...