రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారికి అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను ఆలపించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి...