మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలోని రహదారి పరిస్థితులు,డివైడర్‌ తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం...