మంచిర్యాల// లక్షెట్టిపేట
మంచిర్యాల జిల్లా నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. సోమవారం పోలీస్ స్టేషన్ ముందు రాష్ట్ర రహదారిపై పోలీస్ సిబ్బంది వాహనాలతానికి చేస్తున్న సమయంలో మంచిర్యాల వైపు నుంచి లక్షట్ పేట వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ ని తనిఖీ చేయగా అందులో 34 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగి ఉండడంతో వ్యాన్ తో పాటు రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి వాటిని అక్రమంగా తీసుకువచ్చిన కోట సత్తయ్య, మధుకర్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు 68 వేల రూపాయలు విలువ ఉంటుందని ఎస్ఐ గోపతి సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు