పెద్దపల్లి//,శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మిషన్ బాల సురక్ష – శిక్షా, న్యాయ 2026లో భాగంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు గా నామినేట్ చేసిన ఉపాధ్యాయులకు పిల్లల హక్కుల పై వన్ డే సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ( పొక్సో)కె.స్వప్నరాణి, డీసీపీ రాంరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ — పాఠశాలల్లో విద్యార్థుల భద్రత , రక్షణతో పాటు వారి భవిష్యత్తు ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, విద్యాశాఖ సంయుక్తంగా అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయని తెలిపారు.