ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల వాసులు కోరుకున్న నేతన్న బజార్‌తో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనుల వివరాలు
సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం.
సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ. 99.40 కోట్ల పనులు.
సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలు.
రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణం.
వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం.
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభోత్సవం.