హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోరు తెలంగాణ మంచిర్యాల,సెప్టెంబర్ 10, 2026: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026లో నోటీసుల జారీ అనంతరం సంబంధిత ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, ప్రత్యేక ఉపపాలనాధికారి చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో...