PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:45 pm Posted by : PORU TELANGANA

ములసాలలో పిడుగుపాటు.. 25 గొర్రెలు మృతి

పెద్దపల్లి // మండలంలోని ములసాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోయిని సదయ్య, కాసు నరేష్‌కు చెందిన గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి.

ఒక్కసారిగా పిడుగు పడటంతో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో బాధిత గొర్రెల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు…