చెన్నూరు// కోటపల్లి..Ek Ped Maa Ke Naam కార్యక్రమంలో కోటపల్లి లోని ఉషోదయ స్కూల్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ సర్పంచి ఆలూరి సంపత్, మండల విద్యాధికారి చిందం మొగిలి , విద్యార్థుల యొక్క తల్లులు పాల్గొని సుమారుగా 100 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన కోటపల్లి ఫారెస్ట్ అధికారులకు, గ్రామ పంచాయితీ సిబ్బందికి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కృతఙ్ఞతలు తెలుపుతూ అమ్మ ప్రాణం పోస్తే చెట్టు ప్రాణ వాయువును ఇస్తుంది అని తెలిపారు. అధికారులు మాట్లాడుతూ నేడు నాటిన మొక్కలు రేపటి స్వచ్చమైన కలుషితం లేని వాతావరణానికి సోపానాలు అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అధికారులు ,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు, విద్యార్థులు పాల్గొన్నారు.